నెల్లూరును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

 

రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

నెల్లూరు,నవంబర్‌29(జనం సాక్షి): అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతు న్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏఎస్‌ పేట మండలం, తెల్లపాడు వద్ద కలుజువాగు ఆత్మకూరు నుంచి ఏఎస్‌ పేటకు రాకపోకలు స్తంభించాయి. నక్కల వాగు పొంగిపొర్లుతుండటంతో ఏఎస్‌ పేట నుంచి నెల్లూరు, కలిగిరికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతసాగరం చెరువు అలుగు, కొమ్మలేరు వాగులు రోడ్లపై వరద నీరు పోటెత్తింది. సోమశిల నుంచి ఆత్మకూరు రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. సంగం పెన్నా వారధి వద్ద పెన్నా నది ఉరకలేస్తోంది. దీంతో సంగం నుంచి చేజర్ల, పొదలకూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. మర్రిపాడు మండలంలోని కేతామన్నేరు వాగు రోడ్డుపై పొంగిపొర్లుతోంది. దీంతో పడమటి నాయుడు పల్లికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్‌ ఇన్‌ ఎª`లో: 95,266 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్‌ ఎª`లో: 1,15,946 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 68.37 టీఎంసీలుగా ఉంది.