నెల్లూరు వైకాపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మత్స్యకార గ్రామాలకు వెళ్లకుండా కావలి ఎమ్మెల్యే అరెస్ట్
నెల్లూరు,జూలై28(జనం సాక్షి): నెల్లూరు వైసిపి కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే హౌస్ అరెస్ట్‌లో ఉన్న ప్రతాప్‌రెడ్డిని ఈ నెల 27 వరకు ఓపిక పట్టాలని ఎస్‌పి సూచించారు. సమయం మించిపోవడంతో మత్స్యకార గ్రామాలకు ఎమ్మెల్యే బయలుదేరారు. ఎమ్మెల్యేను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డిని ఇస్కపల్లి మత్స్యకార గ్రామాల్లో పర్యటించకుండా నెల్లూరులో పోలీసులు అడ్డుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా మత్స్యకార గ్రామాల్లో పర్యటించడానికి, వారితో చర్చించడానికి, ఎమ్మెల్యే బయలుదేరుతుండగా పోలీసులు వెళ్లనీయకుండా ఆయన్ను ఆడ్డగిస్తున్నారు. ఈ క్రమంలో గృహ నిర్భందం కూడా చేశారు. శనివారం ఏ విధంగానైనా తప్పనిసరిగా మత్స్యకారుల గ్రామాల్లో పర్యటించాలని, జిల్లా వ్యాప్తంగా ఈ విషయం అందరికీ తెలియాలని మంత్రి నేరుగా వైసిపి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడి గ్రామాలకు బయలుదేరుతుండగా పోలీసులు అక్కడికి వచ్చి బలవంతంగా ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనిపై వైకాపా శ్రేణుఏలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.