నేటినుంచి పాపికొండల సందడ

బోటు షికారుకు మళ్లీ ఏర్పాట్లు
రాజమండ్రి,నవంబర్‌6 ( జనం సాక్షి ):  పాపికొండల యాత్రకు మళ్లీ సందడి మొదలయ్యింది. జలపాతాల
నడుమ సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన పాపికొండల బోట్‌ యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. ఆదివారం నుండే పాపికొండల అందాలు పర్యాటకులను అలరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి పాపికొండల బోట్‌ యాత్ర ప్రారంభమవుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అధికారులు ప్రకటించారు. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ యాత్ర ప్రారంభం కానుంది. తూర్పుగోదావరి కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ… పాపికొండలకు బోటింగ్‌ కార్యకలాపాలు ఆదివారం నుంచి పున్ణప్రారంభం కానున్నట్లు తెలిపారు. బోట్‌ సర్వీసుల పున: ప్రారంభంపై రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో టూరిజం, పోలీసులు అధికారులతో కలెక్టర్‌ హరి కిరణ్‌ సమావేశాన్ని నిర్వహించారు. బోటు ఆపరేటర్లు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్‌ టూర్‌ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనల గురించి కలెక్టర్‌ వివరించారు. తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు ధరించాలని.. కోవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రయాణికులు భౌతిక దూరాన్ని పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రేపటినుంచి బోటు సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు గండి పోచమ్మ ఆలయం బోట్‌ పోయింట్‌ వద్ద ట్రయిల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి నుంచి పాపికొండలకు వెళ్లే ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజన వసతితో కలిపి టికెట్‌ ధరను రూ.1,250 గా ప్రభుత్వం అంతకుమందు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎపి పర్యాటకాభివృద్ధి సంస్థ (ఎపిటిడిసి) డైరెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ… పాపికొండల సర్వీసులతోపాటు భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలోనూ బోట్ల యాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అందుకుగాను ప్రభుత్వం గోదావరి, కఅష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.