నేటి నుంచి ఆదివాసీల సాంస్కృతిక సమ్మేళనం

ఖమ్మం.జనంసాక్షి:  ఖమ్మం జిల్లా చింతూరులో బుధవారం నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌, ఎడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది ఆదివాసీలు తరలిరానున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తారు. ఆదిమజాతుల జీవనావసర, అలంకార వస్తువులు, పనిముట్ల ప్రదర్శన, ప్రభుత్వశాఖల సమాచార విజ్ఞాన ప్రదర్శనలు, వెదురు హస్తకళావూపదర్శన, అమ్మకం,వివిధ ఆదిమ తెగల ఛాయ చిత్ర ప్రదర్శనలు, ఆదిమ జాతుల ఆహార ఉత్పత్తులు, అటవీ ఫలసాయ ప్రదర్శనలు ఉంటాయి. కార్యక్రమంలో మూడు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.