నేటి నుంచి ధర్మపురి నారసింహుని బ్ర¬్మత్సవాలు
విద్యుద్దీపాలంకరణలు, గోదావరి తీరంలో ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్,ఫిబ్రవరి28(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు తరవాత యాదగిరి నృసింహస్వామి బ్ర¬్మత్సవాలు ముగింపునకు చేరుకున్న దశలో అంతే ప్రాశస్త్యం ఉన్న ధర్మపురి నారసింహుని బ్ర¬్మత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణలో ఈ రెండు నారసింహ క్షేత్రాలకు పురాణ ప్రాశస్త్యం ఉంది. యాదగిరి గుట్ట తరవాత ధర్మపురికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గోదావరి తీరంలో వెలసిన ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి బ్ర¬్మత్సవాలు మార్చి 1వతేదీ నుంచి జరుగనున్నాయి. దీంతో ఆలయాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో యోగ, ఉగ్ర, వెంకటేశ్వరస్వాముల కల్యాణ, డోలోత్సవ, రథోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానున్నారు. 2న కల్యాణం, 5వ తేదీన డోలోత్సవాలు జరుగుతాయి. ధర్మపురి బ్ర¬్మత్సవాలకు ఈసారి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో సుప్రియ, అధ్యక్షుడు జె.కృష్ణారావు తెలిపారు. వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్యూలైన్లు, గోదావరి నదిలో బట్టలు మార్చుకునేందుకు షెడ్లు, విద్యుత్తు దీపాలంకరణ, మంచి నీటి సరఫరా తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధర్మపురి దేవస్థానం ఆలయ గోపురాలను శుభ్రం చేయడంతో పాటు ఆలయ ప్రాంగణం అంతా చలువ పందిళ్లు వేశారు. ఆలయం ముందున్న స్థలంలో భక్తులు దర్శనం చేసుకునేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆలయ గోపురాలకు విద్యుద్ధీపాలంకరణ చేపట్టారు. దేవస్థానం ముందున్న బ్రహ్మ పుష్కరిణిలో నీటిని శుభ్రపరిచే పనులకు శ్రీకారం చుట్టారు. ధర్మపురి మంచి నీటి సరఫరా పథకం నుంచి నేరుగా పురాతన భూగర్భ సొరంగం ద్వారా నీటిని కోనేరులోనికి పంపించారు. దీనితో మునుపెన్నడూ నీటి నిలువ లేని కోనేరు నేడు నిండా నీరుతో కళకళలాడుతోంది. నీటి సమస్యలతో విలవిలలాడుతున్న ధర్మపురి ప్రజలు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఆతిథ్యం ఇస్తారని, నీటి సమస్యలను తీర్చడానికి అవసరమైతే జగిత్యాల నుంచి అదనంగా 5 నీటి ట్యాంకర్లను తెప్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జాతరకు వచ్చే భక్తులకు తాత్కాలికంగా పార్కింగ్ స్థలాలను మంగళిగడ్డ వద్దనే నిలిపేలా చర్యలు తీసుకోనున్నారు. జాతీయ రహదారి నుంచి నేరుగా వచ్చే వాహనలను మొదటగా మహాలక్ష్మి ఆలయం సవిూపంలో ఖాళీ స్థలం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. చోరీల నివారణకు ప్రత్యేకంగా మప్టీలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్ర¬్మత్సవాల్లో భాగంగా లక్షలాది మంది భక్తులు హాజరుకానుండడంతో ఆరోగ్యమకరమైన ఆతిథ్యంతో ఆహ్వానం పలకాలని ధర్మపురి పోలీసులు శ్రమదాన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మండలంలోని పలు గ్రామాల సర్పంచులు తమ గ్రామాల నుంచి పంచాయతీ కార్మికులను తీసుకు వచ్చారు. ధర్మపురి పట్టణంలో గోదావరి నది, శ్రీమఠం, చింతామణి చెరువుకట్ట, బస్టాండు, కళాశాల, మంగళిగడ్డ, కమలాపూర్ చౌరస్తా, బ్రహ్మపుష్కరిణి తదితర ప్రాంతాల్లో 500 మందిని ఏర్పాటు చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశుభ్రతా కార్యక్రమం చేపట్టారు. చెట్లు, ముళ్లపొదలను తొలగించారు. ట్రాక్టర్లతో మట్టిని పోసి పలు ప్రాంతాలను శుభ్రం చేశారు. గోదావరి నది పరిసరాలు చెట్లపొదలు, ముళ్ల కంపలను తొలగించారు. గోదావరి నదిలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా తడకల పందిళ్లు వేసుకునేలా మట్టి గడ్డలను తొలగించి చదను చేశారు. గోదావరి నదిలో మురుగు కాలువలలో మట్టిని పోస్తూ శుభ్రం చేశారు. ప్రస్తుతం నదిలో వాతావరణం మొత్తం మారి పోయింది.