నేటి నుంచి పది పరీక్షలు
హజరుకానున్న 8701 మంది విద్యార్థులు
ఆదిలాబాద్: పదో తరగతి ఆడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 8701 మంది వద్యార్థులు హజరు కానున్నారు. ఆయా కేంద్రాల్లో 41 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, మరో 41 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను 275 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతిరోజు ఉదయం 9-30 గంటల నుంచి మధ్యా:హ్నం 12 గంటల వరకు పరీక్ష సమయంగా ఉంటుందని జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్ తెలిపారు. జులై 3వ తేదీ వరకు జరిగే పరీక్షలకు ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన వవరించారు.