నేటి నుంచి లారీల బంద్‌

– దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న లారీలు
విజయవాడ, జులై19(జ‌నం సాక్షి) : డీజిల్‌ ధరల నియంత్రణ, టోల్‌ ట్యాక్సుల క్రమబద్దీకరణ, వాహన బీమా ప్రీమియం తగ్గింపు వంటి డిమాండ్లతో దేశవ్యాప్తంగా లారీ యజమానులు శుక్రవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా పడనుంది. ఏపీ, తెలంగాణాలో కలిపి ఐదున్నర లక్షల మేర లారీలు గ్యారేజీలకే పరిమితం కానున్నాయి. అయితే పాలు, కూరగాయలు, మందులు తీసుకెళ్లే వాహనాలకు సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వటం కొంత ఊరట ఇస్తోంది. తమ డిమాండ్లపై నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లే సమ్మెలోకి వెళ్తున్నట్లు లారీ యజమానులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన సమయంలో ఇచ్చిన హావిూలు నెరవేర్చకపోవటం, తమ సమస్యలు పట్టించుకోకపోవటంతో గతేడాది మార్చిలో లారీ యజమానులు సమ్మెలోకి వెళ్లారు. అయితే వారిని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో హావిూ ఇవ్వటంతో వారం రోజుల అనంతరం సమ్మె విరమించారు. ఇది జరిగి ఏడాది గడిచినా పరిస్థితిలో మార్పు రాకపోవటం… పైగా రవాణా రంగాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తుండటంతో మరోసారి సమ్మెబాట పట్టినట్లు వారు చెబుతున్నారు.

తాజావార్తలు