నేడు ఇంగ్లండ్‌తో భారత్ రెండో టెస్టు
ముంబయి: ఇంగ్లండ్‌తో భారత్ రెండో టెస్టు నేడు ముంబయిలో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ విజయంతో జోరు మీదున్న టీమ్ ఇండియా మరో ఘన విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్‌ను మరింతగా చిత్తు చేసేందుకు సిద్ధమైంది. పిచ్‌స్పీన్నర్లకు అనుకూలించనుండడం ఆతిధ్య జట్టు అనుకూలాంశంగా మారనుంది. మరోవైపు ఇప్పటికే వెనుకబడ్డ ఇంగ్లండ్ రెండో టెస్టులో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.
వీరూకు వందో టెస్టు
వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇది వందో టెస్టు కావడంతో క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్‌లో అతను సెంచరీ చేయాలని, భారత్ నెగ్గాలని కోరుకుంటున్నారు. మ్యాచ్ ఉదయం.9.30 నుంచి స్టార్ క్రికెట్లో ప్రసారం కానుంది.