నేడు జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమం
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి.
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 12వ తేదీన జాతీయ సమైఖ్యత రక్ష బంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, అంగన్ వాడి సెంటర్స్, వృద్ధ ఆశ్రమాలు, అనాద ఆశ్రమాలలో రక్ష బంధన్ కార్యక్రమని ఏర్పాటు చేసిన్నట్లు ఆమె తెలిపారు. అదే రోజు మొత్తం స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా దేశ భక్తి పై రూపొందించిన చలన చిత్రాలను జిల్లాలోని అన్నీ కేబుల్ చానల్స్ లో ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సమాచార శాఖ వారు (7) సినిమాలను జిల్లాకు అందజేయడం జరిగిందని వాటిని శుక్రవారం రోజు మొత్తం ప్రదర్శిస్తారని , దేశ భక్తి పై నిర్మించిన ఈ చలన చిత్రాలు పాఠశాల పిల్లలకు, యువతకు, ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటాయి కాబటీ అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. విద్య శాఖ ద్వారా 12వ తేదీన పాఠశాల స్థాయిలో ఫ్రీడం కప్ స్పొర్ట్స్ & గేమ్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.