నేడు రాజధానిలో.. కదం తొక్కేందుకు కలాలు సిద్ధం

గాయపడ్డ కలాలు .. విప్పనున్న గళాలు
మా కలలు కల్లలు చేస్తే .. కలాలను కత్తులు చేస్తాం
జర్నలిస్టులకు సంఘీభావంగా ‘తెలంగాణ’ కదలిరావాలని కోదండరాం పిలుపు
నేడు జర్నలిస్టుల ఆత్మగౌరవ ర్యాలీ
హైదరాబాద్‌, అక్టోబర్‌29(జనంసాక్షి):
కలం వీరులు కదం తొక్కేందుకు సిద్దమయ్యరు..ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచానికి చాటేందుకు తయారయ్యారు. నేడు రాజధానిలో తెలంగాణ జర్నలిస్టులు కవాతు నిర్వహించనున్నరు. ప్రజాస్వామ్య ఆకాంక్షలను చాటే తమపై ఆంక్షలు ఏంటని కలాల గలాలు సంధిస్తున్న ప్రశ్నలకు సర్కారు స్పందించకపోవడంతో దిమ్మదిరిగేలా తమ సత్తా చాటేందుకు రడీ అయిండ్రు..దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ ప్రాంత మీడియాపై జరిగిన వివక్షను ప్రపంచానికి తెలిపేందుకు సిద్ధమయిండ్రు..నేడు తెలంగాణ జర్నలిస్టుల ఐక్యతను చాటుకొనేందుకు తెలంగాణవ్యాప్తంగా జర్నలిస్టులు టాంక్‌బండ్‌పై కవాతు నిర్వహించనునాన్నారు.. గాయపడ్డ కలాలు తమ గళాలను విప్పనున్నాయి..దీనికి తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే కలం కవాతుకు విశేష మద్ధతు లభించింది..తెలంగాణ
జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలంగాణవ్యాప్తంగా జర్నలిస్టులంతా కలిసి రావాలన్నారు. ప్రధాని కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన తెలంగాణ మీడియాపై జరిగిన దాడిని పూర్తిగా తెలంగాణ పౌరసమాజంపై జరిగిన దాడిగానే అభివర్ణిస్తున్నామన్నారు. జేఏసీ భాగస్వామ్య పక్షాలనేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలన్నారు..తెలంగాణవాదులు శాంతికాముకులన్న విషయం తెలంగాణమార్చ్‌తో బయటపడిందన్నారు. కలాల కవాతులో జర్నలిస్టులకు సంఘీభావంగా తెలంగాణ కదిలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్‌ అల్లం నారాయణ తెలంగాణ ప్రజలను నమ్ముకొనే తాము ఈ కవాతుకు పిలుపునిచ్చామన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సుందరయ్య పార్క్‌ నుంచి కవాతు ప్రారంభమవుతుందని ఇందిరాపార్క్‌ వద్ద సభను నిర్వహిస్తమన్నరు. తెలంగాణలోని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషల మీడియా యజమాన్యాలు సహకరించాలని, భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మీడియాపై జరురగుతున్న దాడిపై స్పందించాల్సిన సీమాంధ్ర మీడియా ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం ప్రమాదకరమన్నారు..జర్నలిస్టులపై జరిగిన దాడి పత్రికా స్వేచ్చపై జరిగిన దాడిగా భావించాలని, జర్నలిస్టు సంఘాలన్నీ కదిలిరావాలని పిలుపునిచ్చాయి..ఇదిలా ఉండగా తెలంగాణ జర్నలిస్టుల కలం కవాతుకు పోలీసుల అనుమతి లభించింది. ఉదయం 11నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. గన్‌పార్క్‌ నుంచి కాకుండా సుందరయ్య పార్క్‌ వరకు ర్యాలీ నిర్వహించకోవచ్చని పోలీసులు తెలిపారు.