నేడు లెక్చరర్ల సంఘ సమావేశం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్చులు కె. మోహన్‌బాబు, ఆర్.సంతోష్‌కుమార్ ఒక ప్రకటన తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో లెక్చరర్ల ప్రమోషన్ల, సమస్యలు, పరీక్షల నిర్వహణలో సీఎస్‌డీవోలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాశెట్టి, కవిత హాజరవుతున్నారని స్పష్టం చేశారు. సంఘ సభ్యులు హాజరు కావాలని కోరారు.