నేడు వరంగల్‌లో బ్రహ్మాణ శంఖారావం

వరంగల్‌: బ్రాహ్మణుల ఆత్మగౌరవ పరిరక్షణలో భాగంగా తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో బ్రాహ్మణ శంఖారావం నిర్వహించనున్నారు. బ్రాహ్మణులను, బ్రహ్మాణ మహిళల మనోభావాలను కించపరిచేలా శంఖారావానికి బ్రహ్మణ సంఘం నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి బ్రహ్మాణులు తరలిరానున్నారు. ఉదయం 11 గంటలకు బ్రాహ్మణులు, పండితులు సంప్రదాయ దుస్తులు ధరించే వేదపఠనంతో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచొ సభావేదిక (మహేశ్వరీ గ్డాన్‌ ) వరకు మంగళవాయిద్యాలతో ర్యాలీ చేయనున్నారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు బలరాంనాయక్‌, శ్రీధర్‌బాబు. సారయ్య, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, దివీప్‌కుమార్‌, అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు భానుమూర్తి పాల్గోంన్నారు. ఈ  సందర్భంగా తెలంగాణ అర్చకు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గంగు ఉపేంవూదశర్మ మాట్లాడుతూ బ్రహ్మాణ న్యాయవాదులు. వైద్యులు, ఉద్యోగులు, పురోహితులు, అర్చకులు శాఖాబేధం లేకుండా తరలిరావాలని పిలుపునిచ్చారు.