నేత కార్మికుల సమస్యలపై కేటీఆర్‌ చర్చలు

కరీంనగర్‌: తమకు కూలీలు పెంచాలంటూ సిరిసిల్ల నేతన్నలు పోరుబాట పట్టి ఇవాళ్టికి ఐదు రోజులైంది. పాలిస్టర్‌ నేత కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారక రామరావు చొరవ తీసుకున్నారు. యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్మికుల సమస్య పరిష్కారానికి తీవ్ర కృషి చేస్తున్నారు. గతంలో కూడా ఆయన కార్మికులు- యాజమాన్యాలకు నడుమ మధ్యవర్తిత్వం నడిపి సమస్యను పరిష్కరించారు. సిరిసిల్లలోని ముప్పై వేల మర మగ్గాలపై దాదాపు ఇరవై ఐదువేల నేత కార్మికుల  కుటుంబాలు బతుకుతున్నాయి. తమ సమస్యలపై ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్‌: చేస్తున్నారు. గత ఐదు రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మెతో సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 30 వేల మర మగ్గాలు మూగబోయాయి.