నేను కీవ్‌లోనే ఉన్నా
మరోమారు జెలెన్ª`స్కీ వెల్లడి
కీవ్,మార్చి8(జనం సాక్షి): రష్యా దాడులను శక్తివంచన లేకుండా తిప్పికొట్టేందుకు తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను కీవ్‌లోనే ఉన్నానని, అజ్ఞాతంలో లేనని తన తాజా ప్రసంగంలో పేర్కొన్నారు. 13వ రోజు కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఒక వీడియోను తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. కీవ్‌లోని తన కార్యాలయంలోనే ఉన్నానని ఆ వీడియోలో ఆయన పేర్కొంటూ కార్యాలయం చుట్టుపక్కల దృశ్యాలను చూపించారు. కదనరంగంలో దిగిన కోయంబత్తూర్ వైద్య విద్యార్థి కీవ్‌లోని బాంకోవ స్ట్రీట్లో ఉన్నాను. ఇందులో దాపరికాలు ఏవిూ లేవు. నేను ఎవరికీ భయపడేది కూడా లేదు. మన దేశభక్తి పోరాటంలో విజయం సాధించేంత వరకూ భయపడేదే లేదని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. గత ఆదివారం రాత్రి కూడా జెలెన్‌స్కీ ’ఫర్‌గీవ్‌నెస్ సండే’ సందర్భంగా జాతినుద్దేశించి మాట్లాడుతూ, రష్యా మారణకాండను ఉక్రెయిన్ ప్రజలు ఎప్పటికీ మరువరని, రష్యాని దేవుడు కూడా క్షమించడని అన్నారు. రష్యా చేసిన తప్పునకు ’డే’ ఆఫ్ జడ్జిమెంట్ రోజున సమాధానం చెప్పక తప్పదన్నారు.