నేను చాలా హర్ట్ అయ్యా: కోహ్లీ

550xzlmk

ముంబయి : ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఓటమికి ప్రియురాలు అనుష్క శర్మ కారణమన్న విమర్శలపై క్రికెటర్ విరాట్ కోహ్లీ  తొలిసారి పెదవి విప్పాడు.  తనపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు చూసి షాక్ అయినట్లు అతడు తాజాగా స్పష్టం చేశాడు. తనపై ఆరోపణలు చేయటం సరికాదని,  వరల్డ్ కప్లో స్థిరంగా ఆడేందుకు తాను ప్రయత్నించానని కోహ్లీ వివరణ ఇచ్చుకున్నాడు.  ‘ సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవటానికి అనుష్క శర్మకు సంబంధం ఏమిటి. ఒక్క మ్యాచ్లో సరిగా ఆడకుంటే ఇన్ని నిందలు వేస్తారా? . నన్ను ఆ వ్యాఖ్యలు చాలా బాధించాయి.  టీమిండియా ఓటమి మేమిద్దరమే కారణమనడంతో చాలా హర్ట్ అయ్యా. అంటూ ట్వీట్ చేశాడు.

సెమీ ఫైనల్స్లో టీమిండియా ఓటమికి అనుష్క శర్మనే కారణమంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.. అనుష్క వల్లే కోహ్లీ తొందరగా ఔట్ అయ్యాడంటూ నెటిజన్లు దుమ్మెత్తి  పోశారు. ఆ తరువాత బాలీవుడ్ అనుష్క-కోహ్లీలకు అండగా నిలవడమే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా మద్దతు తెలిపారు.