నేను నోరు విప్పితే నీ పని మఠాష్
ఆరోపణలు చేసేముందు నిజాలు తెలుసుకో
దమ్ముంటే దెందులూరులో పోటీ చేయ్
వపన్ కళ్యాణ్‌కు చింతమనేని స్ట్రాంగ్ కౌంటర్
విజయవాడ,సెప్టెంబర్ 27(జనంసాక్షి): జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి చూసిన తర్వాత పవన్ మాట్లాడాలని అన్నారు. తనపై 37 కేసులున్నాయని పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని.. వాస్తవంగా తనపై ఉన్నవి 3కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పవన్‌కల్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చేయరని అన్నారు. విజయవాడలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పవన్ స్థాయిని దిగజార్చుకుని తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓ పార్టీకి అధినేతగా ఉన్న పవన్ ఇష్టం వచ్చినట్లు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతారని చింతమనేని అన్నారు. తాను రాజ్యాంగశక్తినని పవన్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. పవన్ తాను కొనుగోలు చేసిన ఛానల్ ద్వారా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పవన్‌కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో బుధవారం రాత్రి నిర్వహించిన పోరాటయాత్ర బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శాసనసభ్యులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ క్రమశిక్షణ తప్పితే ఏమనాలి?, 27 కేసులున్న వ్యక్తిని ప్రభుత్వ విప్‌గా పెట్టారంటే ముఖ్యమంత్రిని ఏమనాలి? అతను స్థానికంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నా పట్టించుకోకపోతే ఏమనాలి? కొల్లేరు భూములను చేపల చెరువులుగా మార్చేశారు.. ప్రైవేటు ఆస్తులను అన్యాక్రాంతం చేశారు… మనుషులను కొట్టడం, ఆడపడుచులపై దాడిచేయడం, ఎస్సీలపై దాడులు ఇన్ని చేస్తున్నా విూరు పట్టించుకోకపోతే ఏమనాలి? అంటూ పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి స్పందించిన చింతమనేని పవన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘ పవన్ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే దేనికైనా నేను సిద్ధమే. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాని.. ఇప్పటికైనా అవగాహనతో మాట్లాడాలి. సమస్యల విూద ప్రశ్నిస్తానంటున్నావ్. నువ్వు ప్రత్యేక ¬దా గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావ్..?. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ పనిచేస్తాను.. ఆ పనిచేస్తాను అని ఎందుకు జనాలకు చెప్పలేకపోతున్నావ్..?. పవన్ నా నియోజకవర్గంలో అడుగు పెట్టారు చాలా సంతోషం. విూ నియోజకవర్గం నుంచే నేను పోటీ చేస్తానని నన్ను శిశుబాలుడితో అభివర్ణించావ్.. అసలు నువ్వు శ్రీ కృష్ణుడివో.. నేను శ్రీకృష్ణుడినో తెలియాలంటే నువ్వు నా విూద పోటీ చెయ్. అప్పుడు నా నియోజకవర్గ ప్రజలు సరైన తీర్పును ఇస్తారు. ఆ రకంగా నన్ను రాజకీయంగా ఎదుర్కో.. తప్పులేదు. ఇంత చెండాలుడిని రాజకీయాల నుంచి తరమటం నీ బాధ్యత అయినప్పుడు నువ్వే పోటీ చెయ్. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేపైన ఇంతగా గురిపెట్టలేదు.. ఒక్క దెందలూరు ఎమ్మెల్యేపైనే గురిపెట్టావ్ గనుక.. రా చావో రేవో దెందలూరులోనే తేల్చుకుందాం’ అని పవన్‌కు చింతమనేని సవాల్ విసిరారు.