నేనేం మాట్లాడాలో విూరే చెప్పండి

పంద్రాగస్ట్‌ ప్రసంగంపై ట్విట్టర్‌లో కోరిన ప్రధాని

వందలకొద్దీ స్పందనలు

న్యూఢిల్లీ,జూలై31(జ‌నం సాక్షి ): స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నేను ఏం మాట్లాడాలో విూరే చెప్పండి అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ఇంకేముందు చాలామంది సబ్జక్టును ఖరారు చేశారు. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆగస్టు 15న దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి ప్రసంగం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది స్వాతంత్య దినోత్సవ ప్రసంగంలో తాను ఏం మాట్లాడాలో చెప్పండి అంటూ ప్రధాని మోదీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ‘పంద్రాగస్టు ప్రసంగంలో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నారు. విూ సలహాలు, సూచనలు నరేంద్రమోదీ యాప్‌ ద్వారా నాతో పంచుకోండి. విూ విలువైన అభిప్రాయాల కోసం నేను ఎదురుచూస్తుంటాను’ అని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. మంగళవారం ఉదయం మోదీ ఈ ట్వీట్‌ చేయగా.. కొద్ది సేపట్లోనే వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. ‘ప్రధాని మోదీ జీ.. కాలుష్య నియంత్రణ గురించి మాట్లాడండి. ఇది మన దేశంలో పెద్ద సమస్యగా మారింది’, ‘నల్లధనం గురించి మాట్లాడండి’ అని, మూకదాడుల గురించి మాట్లాడండి’, ‘మహిళల రక్షణ గురించి మాట్లాడండి’ అని నమో యాప్‌, మోదీ వెబ్‌సైట్లలో కామెంట్లు పెడుతున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య దినోత్సవ ప్రసంగం చేయడం ఇది ఐదోసారి. గతంలో కూడా ఆయన ఇలాగే తన ప్రసంగం కోసం ప్రజల నుంచి సలహాలు కోరారు. గత సంవత్సరం పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని మోదీ చాలా తక్కువ సమయం ప్రసంగించారు.