న్యాయవాది ప్రభాకర్ రెడ్డిని కలిసిన జెడ్పి చైర్మన్ పుట్ట మధు

పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లె గ్రామంలో మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు, న్యాయవాది మాదాడి ప్రభాకర్ రెడ్డి ని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సూరయ్య పల్లె హనుమాన్ దేవాలయం కు ఎండోమెంట్ ద్వార దూప దీప నైవేద్య పథకం మంజూరు కృషి చేసినందుకు జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ని మాదాడి ప్రభాకర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. అలాగే మంథని మండలం గోపాల్ పూర్ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడ్డ మాజీ సర్పంచ్ మేకల కిష్టయ్య ను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ కొండ శంకర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆకుల కిరణ్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు