న్యాయవాదులు రక్తదానం
కరీంనగర్, నవంబర్ 27 : పట్టణంలోని జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులు మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానమిచ్చారు. న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఎందరో ఆభాగ్యులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, క్షతగాత్రులు కావడం జరుగుతుందని అన్నారు. గాయపడిన వారికి, రక్తం కోల్పోయిన వారికి తిరిగి రక్తాన్ని అందించేందుకు రక్తం అవసరమని గుర్తించి రక్తదానం ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించేందుకు రక్తం ఎంతో అవసరమని, అందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా న్యాయవాదులు రక్తదానం చేశారు.