పంచాయతీలను పరిశీలించిన కేంద్ర బృందం

ఈజీఎస్‌ పనులు పరిశీలన
డోర్నకల్ జూలై 16 జనం సాక్షి
మండల పరిధిలోని బొడ్రాయి తండా, తోడేళ్లగూడెం గ్రామాల్లో శనివారం నేషనల్‌ లెవల్‌ మానిటరింగ్‌ (జాతీయస్థాయి పర్యవేక్షణ బృందం)టీమ్‌ సభ్యులు పరిశీలించారు.
కేంద్రప్రభుత్వ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టిన పలు రకాల పనులను పరిశీలించారు.గ్రామాల్లో పల్లెప్రకృతివనాలు,వన నర్సరీలు,చెరువుల పూడికతీత,ఇంకుడు గుంతల నిర్మాణం, కమ్యూనిటీ ప్లాంటేషన్‌, జీపీల వారీగా జాబ్‌ కార్డుల అప్డేషన్‌ వివరాలను గ్రామాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు.అధికారులను అడిగి తెలుసుకొన్నారు.అదే విధంగా చెరువుల పూడికతీత ఎన్ని రోజులు జరిగింది. ప్రతి రోజు ఎంతమంది ఉపాధిహామీ కూలీలు హాజరవుతున్నారు.వారికి పేమెంట్లు ఏ విధంగా చేశారు.పలు అంశాలను పరిశీలించారు.కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో భాగంగా గ్రామాల్లో ప్రధాన ద్వారాల్లో ఏ రకాలైన మొక్కలు నాటారు. ఏం జాగ్రత్తలు తీసుకొన్నారు.గ్రామ పంచాయతీల పరిధిల్లో ఈజీఎస్‌ పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సెక్రెటరీలను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. బొడ్రాయి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ తేజవత్ గమ్మిరాజు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న తీరును చూసి కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేశారు.తోడేళ్లగూడెం ఉపాధి హామీ పనుల్లో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి సన్యాసయా,ఎంపీడీఓ అపర్ణ,ఎంపీఓ మున్వర్ బేగ్,ఏఈపిఆర్ కిషోర్,ఉప సర్పంచ్ భాస్కర్,
సర్పంచ్ అంజయ్య,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area