పంచాయితీ ఎన్నికలు జరిగేనా?

ఎన్నికలకు సంబంధించి కానరాని హడావిడి

అమరావతి,జనవరి18(జ‌నంసాక్షి): జులై నెలాఖరుతో రాష్ట్రంలో పంచాయతీల ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. పంచాయితీ ఎన్‌ఇనకలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా ఆ దిశగా కాలుపడడం లేదు. బహుశా సార్వత్రిక ఎన్నికల తరవాత పంచాయితీ ఎన్నికలు జరుపుతారా లేక ముందు

నిర్వహిస్తారా అన్నది తేలడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరగనుంది. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నప్పటికీ- వెంటనే ఆ దిశగా కదిలే పరిస్థితి అయితే లేదు. అసెంబ్లీ ఎన్నికల వరకు పంచాయతీ పగ్గాలు ప్రత్యేక అధికారులను కొనసాగిస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. తెలంగాణలో ఎన్నికలకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఎపిలో అలాంటి పరిస్థితి కానరావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోకుండా సార్వత్రిక ఎన్‌ఇనకలు ముగిసిన తరవాతనే వీటి గురించి ఆలోచనచేయాలని సిఎం చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. విభజనతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో స్థినిక ఎన్నికలను సత్వరమే నిర్వహించే ఆలోచన కనిపించడం లేదు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 35 శాతానికిపైగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు అధికారాల బదలాయింపు అతి ముఖ్యమైన అంశం. 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థలకు షెడ్యూల్‌ 11లో పేర్కొన్న 29 అధికారాల్లో ఇప్పటికి పది మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. కీలకమైన మిగతా 19 అంశాలపై ప్రభుత్వాలు కిమ్మనక పోవడంతో గ్రామ పంచాయతీలకు నిరాశే ఎదురవుతోంది. రాజ్యాంగ సవరణతో లభించే అధికారాలను పూర్తిగా పంచాయతీలకు బదలాయించక పోడంతో తలెత్తుతున్న సమస్యలను పాలకులు గుర్తించడం లేదు. స్వతంత్రంగా వ్యవహరించి పాలనలో సత్తా చాటాల్సిన పంచాయతీలు ఇప్పటికీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల పైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది. గ్రావిూణాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వ శాఖల్లో అధికారుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో పలుజిల్లాల్లో పంచాయతీ అధికారుల (డీపీఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీపైనా విూనమేషాలు లెక్కిస్తున్నారు. తగిన స్థాయిలో అధికారులు, నిధులు లేనందున జిల్లా పరిషత్తుల్లో నిస్తేజం ఆవరించింది. జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), గ్రావిూణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లను జెడ్‌పీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినా ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోలేదు.