పంచాయితీ ముందు సమస్యలపై ధర్నా

విజయవాడ,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): సిపిఎం, సిపిఐ, జనసేనల ఆధ్వర్యంలో తిరువూరు నగరపంచాయతీ కార్యాలయం ముందు శుక్రవారం సిపిఎం, సిపిఐ, జనసేనల నాయకులు ధర్నా నిర్వహించారు. పట్టణంలో మురుగునీటి కాలువల వల్ల దోమలు పెరుగుతున్నాయని, కోతులు, ఆవులు, పందులు చేరి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తిరువూరు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, మురుగునీటి కాలువలను పూడికతీయాలని కోరారు. పట్టణ ప్రజలకు ప్రతీరోజూ సక్రమంగా మంచినీరు సరఫరా చేయాలని, వీధిలైట్లు వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, జనసేనల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

తాజావార్తలు