పంజాబ్‌లో ఆందోళనలు.. 15 మందికి గాయాలు
, హైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలో ఫరీద్‌కోట్ జిల్లాలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు దైవదూషణ చేశారని ఆరోపిస్తూ ఫరీద్‌కోట్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మోగా జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో పలు సంఘాలకు చెందిన సిక్కులు ఆందోళనలకు దిగారు.పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి వారిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, సిక్కులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నీటిఫిరంగులు, బాష్పవాయుగోళాలు, లాఠీ ఛార్జి చేసి వారిని అదుపు చేశారు. ఈ ఆందోళనల్లో పోలీసులు సహా 15 మందికి గాయాలయ్యాయి.పెద్ద ఎత్తున ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినప్పటికీ పోలీసు బలగాలనూ అదే స్థాయిలో మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఉప ముఖ్యమంత్రి స్షుాబీర్ సింగ్ బాదల్ ప్రజలను శాంతియుతంగా ఉండాలని కోరారు. తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు.