పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అక్బర్ దారుణ హత్య
చండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని శరీరంలోకి బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.జిమ్‌లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. అక్బర్ అతని దగ్గరకు వెళ్లాడు. అప్పుడు నిందితుడు వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యతో ఇద్దరికి సంబంధం ఉందని సీసీటీవీ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు తెలిపారు.అయితే వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉంది. ఆ పార్టీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది.