పంటచేలలో మీరు నిల్వ లేకుండా చూడాలి

ఫర్టిలైజర్ షాపులలో తనిఖీలు జిల్లా వ్యవసాయ అధికారి: చత్రునాయక్
జూలై 13 జనం సాక్షి
మండలంలోని దాట్ల గ్రామంలో పంటల వివరాలు నమోదు కార్యక్రమాన్ని  జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పంటల వివరాలు నమోదు సర్వే నంబర్ల వారిగా   తెలియచేసామన్నారు.  జీలుగా పచ్చిరొట్ట ఎరువు పెంపకంపై సంతృప్తిని వ్యక్తం చేసి రైతు నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అభినందించారు.
 ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంటలలో నీరు నిలువకుండా చేసుకోవాలని సూచించారు.సాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత పత్తి పంట లో 19-19-19 లేదా 13-0-45,లేదా యూరియా లీటర్ నీటికి 10గ్రాములు కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. అదే విధంగా అధిక తేమ,  కలుపు సమస్యను అధిగమించడానికి గొర్రు లేదా గుంటక తో అంతరకృషి చేసుకోవాలని సూచించారు.
ఇనుప ధాతువు  లోపం కనిపించినట్లయితే 2 నుండి 5 గ్రాముల అన్నభేదికి ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేసుకోవాలని అన్నారు.అనంతరం మండల కేంద్రంలోని  ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ షాపులలో  తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి డీలరు తప్పకుండా స్టాక్ బోర్డు మెయింటైన్ చేస్తూ ప్రతి రైతుకు రిసీప్ట్ విధిగా ఇవ్వాలని ఆదేశించారు. విత్తనాలు ఎంఆర్పి ధరలకే విక్రయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్, ఏ ఈ ఓ  లు శిరీష,దీక్షిత్,గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్ సంపేట  మల్లయ్య, సంజీవ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
Attachments area