పంటల పై ఎగుమతి,దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషి తగ్గించాలి
తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్
చౌడాపూర్,సెప్టెంబర్ 27( జనం సాక్షి): అఖిల భారత రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ శాఖ రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ ఫిలిమ్ నగర్,ఫిలిమ్ ఛాంబర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్ మాట్లాడుతూ..దేశ వ్యవసాయ విధానాన్ని మౌలికంగా మార్చడం ఈనాటి అవసరం అని,మనందరి వ్యక్తిగత రాజకీయ మూలాలు అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు,రైతు బీమా,వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు,సాగునీరు లాంటి వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమ పథకాలు మరియు తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాలు తెలంగాణ రైతన్నలకు ఎంతో అండా అని,కెసిఆర్ సంక్షేమ పథకాలు అభినందనీయమే అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో వరి దిగుబడి 3 నుంచి 4 రెట్లు పెరిగింది కానీ ఈ పరిస్థితులలో పంటను అమ్ముకోకుండా తెలంగాణ రైతులు ప్రత్యేకమైన సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు.ఈ సమస్యకు కారణం దిగుమతులు,ఎగుమతుల పైన కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయాలి.అదేవిధంగా వ్యవసాయ ఎగుమతులు,దిగుమతుల పైన కేంద్ర ప్రభుత్వ అజమాయిషి తగ్గించి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి.ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
Attachments area
ReplyForward
|