పక్షంలోగా అన్ని శాఖల సమాధానాలు ఇవ్వాలి

హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్నన ప్రశ్నలు, శూన్యగంటకు సంబంధించి పక్షం రోజుల్లోగా అన్ని శాఖలు సమాధాలు ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని శాషనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. ఇప్పటికి 110ప్రశ్నలకు, మరో 315శూన్యగంట ఆంశాలకు వివిధ శాఖల నుంచి సమాధానాలు రావాల్సి ఉందని పదిహేను రోజుల్లోగా అవి అందేలా చూడాలని సభాపతి తెలిపారు. ఇక మీదట సమాధానాలు సకాలంలో రాని పక్షంలో సభాధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని మనోహర్‌ అభిప్రాయపడ్డారు. ఆటు కమిటీలు లేవనెత్తిన ఆంశాలకు సంబంధించి ప్రభుత్వ శాఖల నుంచి సమాధానాలు రావడం లేదని స్పీకర్‌ సీఎస్‌కు తెలిపారు. స్థాయి సంఘాల ఏర్పాటుకు సంబంధించి నవంబరుకల్లా సిద్ధంగా ఉండాలని సభాపతి సూచించారు. పేపర్‌ వినియోగం తగ్గించడంతో భాగంగా సభకు ఇచ్చే సమాచారాన్ని పూర్తిగా సీడీల రూపంలోనే ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన కార్యక్రమాల సమాచారాన్ని వారం రోజుల కోమారు ఆప్‌డేట్‌ చేసేలా చూడాలని స్పీకర్‌ ఆదేశించారు.

తాజావార్తలు