పచ్చని పంటల తెలంగాణ లో మంటలు పెట్టాలని చూస్తున్నరు
శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్
– నూతన ఆసరా పింఛన్ల కార్డులు పంపిణీ
కురివి సెప్టెంబర్-3 (జనం సాక్షి న్యూస్)
పచ్చని పంటల తెలంగాణ లో మంటలు పెట్టాలని చూస్తున్నరు అని ఆసరా పించన్ పంపిణీ కార్యక్రమం
లో శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్. శనివారం కురవి మండలం తాళ్ళ సంకీస,సీరోల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోర్నకల్ నియోజకవర్గ సంక్షేమ విధాత శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్.అధినేతకు ఘన సన్మానం. కెసిఆర్ చిత్రపటానికి లబ్దిదారులతో కలిసి ఘనంగా పాలాభిషేకం చేశారు.అనంతరం వారి చేతులమీదుగా లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలు,ఐడి కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా పెన్షన్ తో ఆర్థిక భరోసా… వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు,ఒంటరి మహిళలకు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు కొండంత అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, అని కొనియాడారు.లబ్దిదారుల మొఖంలో ఆనందం వెలువరిస్తున్నది,ఒక పెద్దన్నగా… ఇంటికి పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ నిలవడం ప్రజలు చేసుకున్న అదృష్టమని అని అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ తాజాగా వృద్ధులు వికలాంగులు వితంతువులకు డోర్నకల్ నియోజకవర్గంలో 9వేల మందికి కొత్త పెన్షన్లు,మంజూరు చేశారని ,పాతవి,కొత్తవి కలిపి మొత్తం 41000 లు అని ఆయన తెలిపారు.అందరి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో ముందు వరుసలో నిలిపారు. నిరుపేదలైన అభాగ్యులకు ఆసరా పెన్షన్ తో ఆదుకుంటూ వారి జీవితాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్లకే అందించి కొత్త పెన్షన్లు మొదలుపెట్టడం నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్ కి వారి ప్రత్యేకత శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతుల కోసం ప్రాజెక్టుల నిర్మాణం చెరువుల మరమ్మత్తులు,ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి, మహిళలు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు నిండిన వారందరికీ ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు, బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అన్నారు.ప్రధానమంత్రి మోదీ ఉచిత పథకాలను ఎత్తివేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నారని వారన్నారు.పనిచేసే ప్రభుత్వానికి ప్రజల మద్దతు తెలిపితే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు, నాటి సమైక్య పాలనలో 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవారని స్వరాష్ట్రంలో 2016 అందిస్తున్నామని, దివ్యాంగులకైతే 3016 ఇస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుంచి బ్యాంకు ఖాతాలో డబ్బులు మంజూరు అవుతాయని వారు తెలిపారు, ప్రభుత్వాన్ని బదనం చెయ్యడమే లక్ష్యంగా అనవసరం విమర్శలు చేస్తున్నాయని వారన్నారు అలాంటి వారిని నమ్మొద్దని, అన్నం పెట్టిన సీఎం కేసీఆర్ గారిని మరవద్దని సూచించారు.కేంద్ర ప్రభుత్వం ఉచితాలు బంద్ చేయాలని చెప్పడం సిగ్గుచేటు.బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఇలాంటి ఆసరా పింఛన్లు లేవని డబుల్ ఇంజన్ ప్రభుత్వము ఉన్న రాష్ట్రాలను సైతం కేవలం, 500,600, మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని ఆయన అన్నారు, బిజెపి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని,కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకుందని ఆరోపించారు, బడబడ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు ఒకవైపు 10 లక్షల కోట్లు బిజెపి ప్రభుత్వం మాఫీ చేస్తూ… మరోవైపు ఉచితాలు వద్దని అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు…ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జూరి ఉమా పిచ్చి రెడ్డి, యంపిపి గుగులోత్ పద్మావతి రవి నాయక్,తెరాస కురవి మండల అధ్యక్షులు తోట లాలయ్య,రైతు సమన్వయ సమితి కురవి మండల అధ్యక్షులు ముండ్ల రమేష్,సహకార సంఘ చైర్మన్ లు దొడ్డ గోవర్థన్ రెడ్డి,గార్లపాటి వెంకట్ రెడ్డి ,కొండపల్లి శ్రీదేవి,వైస్ ఎంపిపి దొంగలి నర్సయ్య,ఆలయ కమిటీ చైర్మన్ రాము నాయక్,చింతపల్లి సర్పంచ్ హరీందర్ రెడ్డి,ఎంపిడివో సరస్వతి,యంఆర్ఓ ఇమ్మాన్యువేల్,సీరోల్ యంపిటిసి బోజ్య నాయక్,సంకీస ఎంపిటిసి మూడ్ సునీత బాలుచౌహాన్, సీనియర్ నాయకులు రాజేశ్వరరావు, కొత్తూరు సి సర్పంచ్ గంగాధర్ రెడ్డి,మాజీ యంపిపి రాంచంద్రయ్య, సీనియర్ నాయకులు గాడిపల్లి రాములు,తెరాస నాయకులు పెద్ది వెంకన్న,మోదుగుల గూడెం గ్రామ రైతు కో ఆర్డినేటర్ నాయిని దేవేందర్ రెడ్డి,బిసి సెల్ కురవి మండల అధ్యక్షులు పెద్ద బోయిన శ్రీశైలం యాదవ్
ఎంపిఓ పద్మ,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.