పట్టణంలో విజృంభిస్తున్న విష జ్వరాలు

మున్సిపాలిటీవారు పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలలో విఫలం – ఎండీ. అజీజ్ పాషా
హుజూర్ నగర్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ విష జ్వరాలు విజృంభిస్తున్నందున మున్సిపాలిటీ వారు సిబ్బందిచే దోమల మందు, హైపో క్లోరైడ్ ద్రావణం, బ్లీచింగ్ పౌడర్ అన్ని వార్డుల్లో ఫాగింగ్ చేయించాలని టీ.పీ.సీ.సీ
రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ.
అజీజ్ పాషా అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ అధికారి సీనియర్ అసిస్టెంట్ రాఘవరావుకి వినతిపత్రాన్ని సమర్పించటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్ పాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాచిమంచి గిరిబాబులు మాట్లాడుతూ ఈ వర్షాకాల సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా అంటువ్యాధులు ప్రబలుతూ పట్టణంలో జ్వరాలు విజృంభిస్తున్నా మున్సిపాలిటీవారు పారిశుధ్యనికి సంబంధించిన అంశాలలో విఫలమవుతున్నారని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో వందలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు ఆ గురుకుల పాఠశాలలలో దోమల మందును,బ్లీచింగ్ పౌడర్ ను, హైపో క్లోరైడ్ ద్రావణాన్ని ఫాగింగ్, పిచికారీ,
చేయించవలసిన బాధ్యత మున్సిపాలిటీపై ఉందన్నారు.
పట్టణంలో అన్నీ వీధులలో పందులు, పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పిచ్చి కుక్కలు ప్రజలను కరుస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాటిని తక్షణమే నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. బావుల వద్ద బోర్లు, వాటర్ ఫిల్టర్ బెడ్ ల వద్ద , మురికి కాలువల వద్ద పూర్తి స్థాయిలో బ్లీచింగ్ చల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, కొలపుడి యోహాన్, కస్తాల ముత్తయ్య, దొంతగాని జగన్, అంజయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.