పట్టణ పరిశుభ్రత పర్యవేక్షణలో ప్రథమ పౌరుడు.

 మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య
 పారిశుద్ధ్య కార్మికులు సమాజసేవకులు.
 ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి.
తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి.
 ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ను బహిష్కరించాలి.
 తొర్రూర్ 25 జూన్( జనంసాక్షి )సమాజంలో అసలైన ప్రజా సేవకులు పారిశుద్ధ్య కార్మికులేనని మునిసిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య,అన్నారు. శనివారం పట్టణ పరిశుభ్రత  పర్యవేక్షణలో భాగంగా కార్మికులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కాసేపు చెత్త సేకరణ చేసే ట్రాక్టర్ నడుపుతూ కార్మికులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ. కరోనా కట్టడిలో ప్రాణాలొడ్డి   కార్మికులు చేసిన న సేవలు వెలకట్టలేనివన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారంటూ ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలను పెంచాలని. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డెంగ్యూ కలరా మలేరియా వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను బహిష్కరించాలనే బాధ్యత మనందరిపై ఉందన్నారు అనంతరం ఐదో వార్డులో రోడ్డుపై నిలిచిన నీటిని కచ్చా కాలువ ద్వారా కాలువ లోకి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు జై సింగ్. మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు