పట్టు విడుపు….

పాలకుల సడలని బెట్టు
వీడని సంఘాల మంకు పట్టు
వెరసి తప్పక తప్పని ఇక్కట్లు

పండుగ వేళా…
స్వంత ఊళ్లకు వెళ్లాలనే ఆత్రుత
ప్రయివేటు యజమాన్యక రేట్ల మోత
వెరసి ప్రయాణికుల నానా యాతన

చేరవేయు వాహనం దొరక్క
చేరాల్సిన గమ్యం చేరలేక
ప్రయాణ ప్రాంగణాల్లో
పిల్లా పాపాలతో పడరాని పాట్లు
గంటల తరబడి వేచి చూపుల పోట్లు

ఓపిక నశించి “సమ్మె” బాట అంటూ ఒకరి
విరమించకపోతే “కబడ్ధార్” అంటూ ఇంకొకరు

ఆంబోతుల కొట్లాటలో లెగపిల్ల. ల్లే
నలుగుతున్న జనం తీరు
ఇవేవీ పట్టని ఆధిపత్య పోరు

ఎవరిని తప్పుపట్టాలో
ఇంకెవరిని తలనెత్తుకోవాలో
తెలియని సందగిగ్ద స్థితిలో సామాన్యుడు

రోజు రోజుకు చిక్కనౌతున్న సంక్షోభం
చుక్కలు చూస్తున్న సామాన్య జనం

అలవికాని క్షణాన నేతల “అలక” ఎందుకో?
సంక్లిష్ట సమయాన పాలక ‘పంతం” దేనికో?

పట్టువిడుపు ఉంటే సమస్య పుట్టునా?
సంయమనం పాటిస్తే పరిష్కృతి కష్టమా?

ఇప్పటికైనా! ఇరు పక్షాలు
భేషజాలు బేషరతుగా పక్కనెట్టి
శాంతియుత వాతావరణంలో
సమస్య పరిస్కారానికి కృషి చేయాలి

             “””””””””””””””””
(ఆర్టీసీ సంఘాల సమ్మెకు స్పందనగా…)

                    కోడిగూటి తిరుపతి
జాతీయ ఉత్తమ కవి పురస్కార గ్రహీత
MBl no; 9573929493