పడమట నర్సాపురంలో “వన మహోత్సవం”
జూలూరుపాడు, ఆగష్టు 10, జనంసాక్షి: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల మొక్కలు నాటారు. వజ్రోత్సవ వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజా భాగస్వామ్యంతో నిర్వహిస్తూ, ప్రజలకు భారతదేశ స్వాతంత్ర్య చరిత్ర, గొప్పతనం గురించి ప్రజలకు వివరించేందుకు కృషి చేయడం జరుగుతుందని పలువురు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కళావతి, పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ కట్రం మోహన్ రావు, కొమ్ముగూడెం సర్పంచ్ బానోతు శాంతిలాల్, కరివారిగూడెం సర్పంచ్ శాంతిరాం, చింతలతండా సర్పంచ్ రాములు, తహశీల్దార్ లూధర్ విల్సన్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎండీవో తాళ్లూరి రవి, ఎంపీవో రామారావు, ఎస్సై గణేష్, అటవీశాఖ రేంజ్ అధికారి ప్రసాదరావు, ఈజీఎస్ ఏపీవో సుహాసిని, గిర్దావర్ తిరుపతి పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.