పత్తిరైతు ఆత్మహత్య
కరీంనగర్ : విద్యుత్ తీగెలు పట్టుకొని ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నాయిని పరుశాం(40) అనే వ్యక్తి తనకుగల నాలుగు ఎకరాల్లో పత్తిని సాగుచేశాడు. పత్తి సాగు కోసం తెలిసిన వాళ్లదగ్గర అప్పులు చేశాడు. గత ఏడాది కూడా పంటల సాగు కోసం అప్పులు చేశాడు. పాత, కొత్త అప్పులు మొత్తం కలిపి రూ. 5లక్షల వరకు అయ్యాయి. అయితే… ప్రస్తుతం వేసిన పత్తిపంట ఎర్రబారి పోవడం, దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన తన చేలో వ్యవసాయ బావి దగ్గరగల విద్యుత్ తీగెలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు