పదవీబాధ్యతలు స్వీకరించిన చిరంజీవి
న్యూఢిల్లీ: కేంద్ర పర్యటక శాఖ మంత్రిగా చిరంజీవి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, భారతీయ పర్యాటకశాఖను మరింతగా అభివృద్ధి పరుస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మరిన్ని చర్యలు చేపడతామని చిరంజీవి ప్రకటించారు. కాకతీయ ఉత్సవాలకు 20 లక్షల నిధులను విడుదల చేస్తూ కేంద్రమంత్రి హూదాలో చిరంజీవి తొలిసంతకం చేశారు.