పదవీ బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి
ఢిల్లీ: వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమత్రిగా పదవీ బాధ్యతలను పురందేశ్వరి సోమవారం ఉదయం స్వీకరించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్న పురందేశ్వరికి వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాధ్యతలను అప్పగించిన విషయం తెలసిందే.