పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 7  ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 2013 జులై నుంచి అమలు అయ్యే విధంగా పదో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్‌, మాధవరావు డిమాండ్‌ చేశారు. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2012  డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన వారికి తాత్కాలిక ప్రాతిపదికన పాఠశాలలు కేటాయించి వేసవిలో బదిలీల ప్రక్రియ చేపట్టి 2008 డిఎస్సీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. భాగస్వామ్య పింఛన్‌ విధానాన్ని మార్చి విద్యారంగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.