పపంచం భారత్‌ను ప్రత్యేకంగా చూస్తోంది: ప్రధాని మోదీ
హైదరాబాద్: ప్రపంచం భారతదేశాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.అమెరికా పర్యటనలో ఉన్న మోదీ భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్‌లో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ జన్మదినం నాడు ప్రవాస భారతీయులను కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. భరతమాత ముద్దుబిడ్డకు శతకోటి వందనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానిగా తనకు ఇది రెండోసారి అమెరికా పర్యటన అని మోదీ తెలిపారు. గతేడాది పర్యటనలో మాడిసన్ స్వ్కేర్‌లో భారతీయులను కలిశానని.. ఏడాది తర్వాత కాలిఫోర్నియాలో ప్రవాసులను కలిశానని అన్నారు. అమెరికా ప్రజలు భారతీయుల పట్ల ్ణొరవం చూపుతారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారత్ పట్ల ఆశ, నమ్మకంతో చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. 21 శతాబ్దం ఆసియా ఖండానిదేనని అన్నారు. 125 కోట్ల భారతీయుల సంకల్పంలో మార్పు వచ్చిందని… ఈ మార్పు ఒక్క మోదీ వల్లే వచ్చినది కాదన్నారు. భారతీయుల చేతివేళ్లు కంప్యూటర్ కీబోర్డుపై మ్యాజిక్ సృష్టిస్తున్నందువల్లే భారత్‌కు గ్లోబల్ గుర్తింపు వచ్చిందన్నారు. భారతీయులు మేధో సంపత్తితో ప్రపంచ గమనాన్ని శాసిస్తున్నారని కొనియాడారు. మేధో వలస మేధో సంపదగా మారుతోందన్నారు. గోపాల్ ముఖర్జీ 1940లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదివిన మొట్టమొదటి భారతీయుడని, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కాలిఫోర్నియాలో చదువుకున్నారని మోదీ తెలిపారు.తన దేహం దేశం కోసమేనని… దేశం కోసం జీవిస్తా.. దేశం కోసం మరణిస్తానని మోదీ స్పష్టం చేశారు. దేశం కోసం చేసే పనిలో ఎలాంటి ప్రయత్నం లోపం ఉండదన్నారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నామన్నారు. మన దేశంలో 65శాతం మంది యువకులేనని.. శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని అన్నారు. పేదరికం లాంటి అనేక సమస్యలున్నా… దేశం ప్రగతిబాటలో ముందుకెఏ్పు్తందన్నారు.భారత్ అంతరిక్ష సేవల్లో అగ్రస్థానానికి పోటీ పడుతోందని మోదీ అన్నారు. ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాలు ప్రయోగించే స్థాయికి భారతీయులు ఎదిగారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకాని విధంగా అంగారక గ్రహంపైకి ప్రయోగించిన మామ్ తొలి ప్రయత్నంలోనే విజయవంతమైందన్నారు. ఒకప్పుడు ఉపగ్రహాల ప్రయోగంపై డబ్బులు వృథా అని విమర్శలు చేసేవారని… ఇప్పుడు అవే ఉపగ్రహాలు మనకు సంపద తెచ్చిపెడుతున్నాయన్నారు.భారత దేశం శాంతికి నిలయమని… బుద్ధుడు, గాంధీ లాంటి మహనీయులకు భారత్ పుట్టినిల్లని మోదీ అన్నారు. ప్రపంచం ఉగ్రవాదం నుంచి బయటపడేందుకు ఎంతకాలం పడుతుందని మోదీ ప్రశ్నించారు. ఉగ్రవాదం వైపు ఎవరున్నారో… మానవతావాదం వైపు ఎవరున్నారో ప్రపంచ దేశాలు తేల్చుకోవాలని సూచించారు. ఉగ్రవాదంలో మంచి చెడు లేవని… ఉగ్రవాదం ఉగ్రవాదమేనని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదానికి నిర్వచనం చెప్పడంలో ఐరాస విఫలమైందన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ సిలికాన్‌వ్యాలీకి ఓ బహుమతి ఇచ్చారు. భారత రాజధాని న్యూదిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసు నడుపనుందని ప్రకటించారు. ఈ విమాన సర్వీసు మధ్యలో ఎక్కడా ఆగకుండా నేరుగాశాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తుంది. డిసెంబరు 2 నుంచి ఈ సర్వీసు ప్రారంభం కానుంది. వారానికి మూడు సార్లు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతంలోని భారత ఐటీ ఉద్యోగులు ఎంతోకాలంగా శాన్‌ఫ్రాన్సిస్కోనుంచి దిల్లీ వరకు నాన్‌స్టాప్ విమాన సర్వీసు కోసం డిమాండ్ చేస్తున్నారు. మోదీ ఇప్పుడు ఈ డిమాండ్‌ను అంగీకరించి విమాన సర్వీసును ప్రకటించారు.