పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం
ఆదిలాబాద్,నవంబర్22): ట్రాన్స్‌ఫార్మర్లకు ఫీజులు వేసే సమయంలో ,విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చే సమయంలో కానీ, ఎల్‌సీ తీసుకుని పనులు చేస్తున్న సమయంలో ఎంతో మంది ప్రైవేటు- కాంట్రాక్టు కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో విద్యుత్ ప్రమాదాలు పేదల బతుకుల్లో చీకట్లు నింపుతున్నాయి. వేర్వేరు కారణాల వల్ల విద్యుదాఘాతానికి గురై ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు జరిగి ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సంవత్సరాల తరబడి అధికారుల చుట్టు తిరుగుతున్నా ఫలితం కానరావడంలేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఈ విషయమై మంచిర్యాల డీఈ శ్రీనివాస్‌ను వివరణ కో రగా విద్యుత్ ప్రమాదాలకు గురై మృ తి చెందిన వారికి నష్టపరిహారం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని అన్నారు. నష్టపరిహారం విడుదల కాగానే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పంపిణీ చేస్తామన్నారు. అంతే కాకుండా మరెంతో మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. ఏండ్ల తరబడి పరిహారం కోసం కార్యాలయాల చుట్టు- తిరుగుతున్నా అధికారులు కనికరించడంలేదు.తరుచుగా జరుగుతున్న ప్రమాదాల్లో విద్యుత్ శాఖ తప్పిదం ఉన్న సంఘటనలో మాత్రమే పరిహారం చెల్లిస్తున్నారు. పలు కేసుల్లో అవగాహన లేని కుటుంబ సభ్యులు నిబంధనలు పాటించకపోవడం వల్ల నష్టపరిహారం చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం విూనమేషాలు లెక్కిస్తుండగా అధికారులు మాత్రం ప్రతిపాదనలు పంపించడంలో జాప్యం చేస్తున్నారు. మంచిర్యాల డివిజన్ పరిధిలో గత నాలుగేండ్ల కాలంలో 24 మంది విద్యుత్ ప్రమాదాల కారణంగా మృత్యువాత పడగా, ఇందులో కేవలం నలుగురికి మాత్రమే నష్టపరిహారం అందింది. మిగతా 20 మందికి నష్టపరిహారం అందకపోవడంతో కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.