మనగ్వా: అమెరికాలోని కరేబియన్ సముద్రంలో ఓ పర్యాటక ఓడ మునిగిపోయింది. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. నికరగ్వా సమీపంలోని లిటిల్ కార్న్ ద్వీపంలో ఈ ప్రమాదం జరిగింది. 44 మంది పర్యాటకులతో వెళ్తున్న కరేబియన్ క్వీన్ అనే ఓడ సముద్రంలోని భారీ అలలు, ఈదురుగాలులకు తట్టుకోలేక ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ ఘటనలో 13మంది పర్యాటకులు మృతిచెందారు. సహాయ సిబ్బంది 21మందిని రక్షించారు. అమెరికాలో తీవ్ర మంచు తుఫాను సంభవిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు, నావికులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితేకరేబియన్ క్వీన్ యజమాని మాత్రం వీటిని ఖాతరు చేయకుండా ప్రయాణికులతో వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. యజమానిపై కేసు నమోదు చేసి.. ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.