పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు
ఆదిలాబాద్, జూలై 5 : జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ అశోక్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పర్యాటక కేంద్రాలలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదన పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కుంటాల, పొచ్చర జలపాతాలను సందర్శించేందుకు వచ్చే ప్రజలకు సౌకర్యాలతోపాటు ఆహ్లదాన్ని పంచేందుకు వివిధ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా నేరేడుగొండ, ఉట్నూరు, జన్నారం ప్రాంతాలలో పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలను కేటాయించాలని ఆర్డీవోలను ఆదేశించారు.