పర్యాటక ప్రాంతంగా గాదేగుమ్మి

విశాఖపట్టణం,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రముఖ గాదేగుమ్మి జలపాతం పర్యాటక శోభను సంతరించు కుంటోంది. వర్షాలు పడడంతో నీటి జాలువారు కారణంగా ఈ ప్రాంతం పచ్చని తివాచి పరుచుకుంది. సహజసిద్దమైన కొండలు అందాలు ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్శిస్తాయి. ఇక్కడికి వచ్చేవారు దగ్గర నుంచి దీని అందాలను తిలకించేందుకు అనుకూలంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పోకిరీల బెడద కారణంగా పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎందరినో పొట్టన పెట్టుకున్నప్పటికీ దీనిని చూసేందుకు అన్ని కాలాల్లోనూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారంతా జలపాతాన్ని నేరుగా తిలకించేందుకు అనువుగా షెడ్లను నిర్మించారు. వర్షాకాలం కావడంతో జలపాతం నీరు షెడ్లను తాకుతోంది. వీటిల్లో నుంచి చూస్తే ఉవ్వెత్తున పారుతున్న నీరు ఆకట్టుకుంటోంది. కార్తీక మాసంలో ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ షెడ్లలోనే కొందరు మద్యం సేవిస్తున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీసాలను దూరంగా పారేయకుండా పగులగొడుతున్నారు. దీంతో గాజు ముక్కలు ఆ ప్రాంతమంతటా పడి ఉంటున్నాయి.

————–

తాజావార్తలు