పర్యావరణ హితం పట్టని పాలకులు న్యూఢల్లీి

పెరుగుతున్న పట్టణీకరణతో కాలుష్యం
నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం
న్యూఢల్లీి,డిసెంబర్‌20 (జనంసాక్షి): పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం నినాదంగా మారింది. ఢల్లీి విషయమే తసీఉకుంటే వాతావరణ కాలుష్యం అరికట్టే చర్యలు కానరావడం లేదు. కోర్టులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు. పంటవ్యార్థాలను కాల్చకుండా కూడా అరికట్టడం లేదు. మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల గురించి బడి చదువుల దగ్గరనుంచి గురువులు నూరిపోయడమే ఇందుకు కారణం. దురదృష్టమేమంటే అధికార పీఠాలపై ఉన్న నేతలు, ఉన్నతాధికార వర్గంలో పనిచేస్తున్నవారు ఏ బళ్లో చదువుకుని ఆ స్థాయికి ఎదిగారోగానీ… దేశంలో ’అభివృద్ధి’ పేరు చెప్పి వృక్ష సంహారం జరగని రోజంటూ దేశంలో ఉండటం లేదు. చెట్లను కాపాడటానికి పర్యావరణ ఉద్యమకారులు చేయని పోరాటమంటూ లేదు. ప్రాణవాయువును అందిస్తున్న వృక్షజాలాన్ని ధ్వంసం చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. విభిన్న జాతుల పక్షుల్ని వీక్షించడానికి, తమ కెమెరాల్లో బంధించడానికి విహంగ ప్రేమికులు నిత్యం ప్రకృతి ఒడిలోకి వస్తారు. ప్రశాంతంగా స్వచ్ఛమైన వాయువు పీల్చి పునీతులు కావడానికి నగర వాసుల్లో అత్యధికులు ఎన్నుకునే పార్కులు, చెట్టు ఉన్నచోటే. ఇది లోపించడం వల్ల ఇటీవల ఢల్లీి కాలుష్యం పీల్చలేనంతగా తయారయ్యింది.  చెట్లనుంచి వీచే గాలిని ఆస్వాదిస్తూ వందలమంది సైక్లింగ్‌, జాగింగ్‌ చేస్తుంటారు. పాలకుల తీరు కారణంగా, నగాల వ్యాప్తి కారణంగా ముంబైతో సహా మన మహానగరాలు కాంక్రీట్‌ జంగిల్స్‌గా మారుతున్నాయి. ఉపాధి దొరుకు తుందని పల్లెలు వీడి వస్తున్న వారితో పట్టణీకరణ పెరుగుతోంది. ప్లాస్టిక్‌ విపరీతంగగా వాడకం పెరరిగి అనేకం కాలుష్య కారకాలుగా తయారయ్యాయి.  ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలు 20 ఉంటే అందులో 15 మన నగరాలే. తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రపంచంలోని 15 నగరాల్లో మన వాటా 11. ఈ నగరాల వాతావరణంలో, ఇక్కడి తాగునీటిలో మృత్యువు దాగుందని నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. నగర పౌరుల ఊపిరితిత్తుల్లోకి కొంచెం కొంచెంగా చొరబడుతున్న కాలుష్యం వారిని రోగగ్రస్తులుగా మారుస్తోంది. కేన్సర్‌, గుండె జబ్బులు వగైరాలకు కారణమవుతోంది. అనేకుల్లో అకాల వృధ్ధాప్యాన్ని కలిగిస్తోంది. వారిని పనిపాటలకు దూరం చేస్తోంది. ఇదంతా మన పాలకులకు ఆందోళన కలిగించాలి. దీన్ని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి పురిగొల్పాలి. కాలనీలో చెట్లు పెంచాలి. ఉన్న చెట్లను తొలగించకతప్పదను కుంటే ఆ చెట్లను మరొకచోట పాతడానికి ప్రయత్నించాలి. ప్రపంచ అధ్యయన
సంస్థలు చెబుతున్న వాస్తవాలను అమలు చేయాలి. ఇల్లు కట్టుకుందా మనో, ఉన్న ఇంటిని విస్తరించుకుందామనో ఎవరైనా తమ ఆవరణలో చెట్లు కొట్టాలంటే అందుకు అనుమతులు తీసుకోవడం అవసరం. కానీ తమకు అలాంటి నిబంధనలు వర్తించవన్నట్టు అధికార యంత్రాంగాలు ప్రవర్తిస్తున్నాయి. పాలకులే ఇలా చట్టాల్ని ధిక్కరించే స్థితికి దిగజారడం కారణంగా దేశంలో పర్యావరణం దెబ్బతింటోంది.
“““““““““““`