పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి.
ఖానాపురం అక్టోబర్ 23జనంసాక్షి
మండల ప్రజలు పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ జరుపుకోవాలి అని ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అన్నారు. ఖానాపురం మండల ప్రజలకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఈ దీపావళి ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా మండల ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని వారు ఆకాంక్షించారు.దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణకు ప్రతీక దీపావళి పండుగ అన్నారు.పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో దీపావళి పండుగ సంబురాలను ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలన్నారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఆనందపు వెలుగులు నింపాలన్నారు.
Attachments area