పల్లెను పరామర్శించిన జెసి

అనంతపురం,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సతీవియోగంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డిని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఎంపీ జేసీ, ఆయన తనయుడు, రాష్ట్ర ఒలింపిక్స్‌ ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌ కుమార్‌ కలిసి అలమూరు రోడ్డులోని పీవీకేకే కలాశాల ఆవరణలో ఉన్న పల్లె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆపై పల్లె ఉమ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పల్లె ఉమా ఆత్మకు శాంతి చేకూరాలని, పల్లె కుటుంబానికి ఎంపీ జేసీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సమయంలో ఎంతో నిబ్బరంగా ఉండాలంటూ పల్లెకు జేసీ ధైర్యంచెప్పారు. అలాగే పల్లె కుమారుడు క్రిష్ణకిషోర్‌, కోడలు సింధూరను కలిసి ధైర్యంగా ఉండాలని ఎంపీ జేసీ తెలిపారు.

 

తాజావార్తలు