పల్లెపోరు తీర్పు ప్రజాపాలనకు అనుకూలం

` 2029లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి
` ఇదే స్పూర్తితో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తాం
` పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి
రెండేళ్ల మా పాలన పట్ల ప్రజల్లో సానుకూలత
కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో సైతం ఆదరించారు
ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌,బీజేపీలు బుద్ధిగా మసలుకోవాలి
గాంధీజీ పేరు తొలగించడం దారుణం
నదీ జలాలలపై బీఆర్‌ఎస్‌ ద్రోహం
దమ్ముంటే కేసీఆర్‌ చర్చకు రావాలి
అసెంబ్లీలో ఎప్పుడైనా చర్చిస్తాం
మీడియా ముందుకు వచ్చినా వివరిస్తాం
కేసీఆర్‌కు ముఖ్యమంత్రి సవాల్‌
ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై త్వరలో నిర్ణయం
అందరితో చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం
ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి): మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అద్భుతమైన ఫలితాలను సాధించిందని.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృత మవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మా రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఫలితాలని ఆయన అభివర్ణించారు. కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలందరి కీ ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిచ దామోదర్‌ రాజనర్సింహలతో కలిసి సీఎం మాట్లాడారు. మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అద్భుత ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపునకు కష్టపడిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలియజేశారు. 12,702 పంచాయతీలకు గాను 7,527 పంచాయతీల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందన్నారు. 808 కాంగ్రెస్‌ రెబల్స్‌ నెగ్గారని వివరించారు. 66 శాతం ఫలితాలను కాంగ్రెస్‌ సాధించిందని తెలిపారు. 3,511 కాంగ్రెస్‌ , 710 బీజేపీ మొత్తంగా 33 శాతం గెలిచాయని పేర్కొన్నారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరిగాయని.. 87 నియోజక వర్గాల పరిధిలో కాంగ్రెస్‌ మెజారిటీ సాధించిందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం కనబరిచారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమిగా పోటీ చేశాయని ఆరోపించారు. ªఖఆర్‌ఎస్‌, బీజేపీ కూటమికి 33శాతం విజయాలు మాత్రమే దక్కాయన్నారు. బీఆర్‌ఎస్‌కు 3,511 సర్పంచ్‌ స్థానాలు, బీజేపీ 710 చోట్ల గెలిచాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూటమికి 4,221 స్థానాలు మాత్రమే దక్కాయని సీఎం రేవంత్‌ తెలిపారు. ఇటీవల ప్రజాపాలన రెండేళ్ల సంబురాలు నిర్వహించుకున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12వేలకు పైగా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయి. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. దాదాపు 146 గ్రామ పంచాయతీలు (ఒక శాతం) సీపీఐ, సీపీఎం, ఇతరులు గెల్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు మా రెండేళ్ల పాలనపై తీర్పుగా భావిస్తున్నాం అని సిఎం అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పెద్దల సూచనను పాటిస్తాం. కానీ, ప్రతిపక్షంలో ఉన్న వారికి ఇంకా అహంకారం తగ్గలేదు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. పేదలకు మేం అందిస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి కారణం. ఈ ఫలితాలను చూసి భారత రాష్ట్ర సమతి నేతలు అద్భుతం అంటున్నారు. సంతోషం.. విూరు కోరుకున్నట్టే ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది. 2/3 మెజార్టీతో 2029లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3తో భారత రాష్ట్ర సమితి ఉంటే.. 2/3 మెజార్టీతో కాంగ్రెస్‌ ఉంటుంది. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతోందని సీఎం అన్నారు.
నదీ జలాలలపై బిఆర్‌ఎస్‌ ద్రోహం
నదీజలాల విషయంలో ద్రోహం చేసిందెవరో విూడియా ముందకు వస్తే నిజాలు వెల్లడిస్తానని సిఎం రేవంత్‌ సవాల్‌ చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. నదీ జలాల విషయంలో మాట్లాడేందుకు కేసీఆర్‌ విూడియా ముందుకు రానున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. నదీ జలాలు, ప్రాజెక్టులపై చర్చిద్దాం రండి అంటూ కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఛాలెంజ్‌ విసిరారు. కేసీఆర్‌ ఎప్పుడు కోరితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతానని అన్నారు. బురదజల్లి పారిపోవడం కాదు.. నీటి వాటాల్లో ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో చర్చిద్దాం రావాలంటూ కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. కృష్ణా జలాలపై ప్రతిపక్ష నేతగా లేఖ రాయండి. కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం. గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఎక్కువ ద్రోహం చేశారు. విూరు చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం అని రేవంత్‌ అన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నిక పోరు ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ హవా చాటింది. పెద్ద సంఖ్యలో సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విూడియా ముందుకు వచ్చారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైనా కీలక కామెంట్స్‌ చేశారు. కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవలేదని సీఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను తప్పించాలని హరీష్‌ రావు వర్గం సోషల్‌ విూడియాలో ప్రచారం మొదలు పెట్టిందని.. అందుకే ఆ విషయం చర్చకు రాకుండా కేటీఆర్‌ జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారని అన్నారు. ఇదిలాఉంటే.. ఫార్ములా ఈ రేస్‌ కేసుపైనా సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందన్నారు. అరవింద్‌ కుమార్‌కు సంబంధించి అనుమతి రావాల్సి ఉందన్నారు. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మెస్సీ ఈవెంట్‌ పూర్తిగా ప్రైవేట్‌ కార్యక్రమం అని సీఎం మరోమారు స్పష్టం చేశారు. మెస్సీ ఈవెంట్‌కు తాను గెస్ట్‌ మాత్రమేనని చెప్పారు. సింగరేణి యాజమాన్యం అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇచ్చిందన్నారు. ఫుట్‌బాల్‌ ఆడిరచాలనే తన మనవడిని తీసుకెళ్లినట్లు సీఎం వివరించారు. తాము పబ్బులు, గబ్బుల చుట్టూ తిప్పలేదన్నారు.
ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై త్వరలో నిర్ణయం
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణం లో, ప్రజాస్వామిక బద్ధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించడంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం మేరకు ఎంపీటీసీ, జేడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలపై నిర్ణయానికి వస్తామని చెప్పారు. రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గాను 12,702 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా, ప్రజాస్వామిక బద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, ప్రజలు స్వేచ్ఛగా తీర్పును ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో అధికారులు స్వేచ్ఛగా పనిచేశారని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహరు, ధనసరి అనసూయ సీతక్కలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి విూడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజల ముందుకు వెళ్లగా, తమకు 7,527 గ్రామ పంచాయతీల్లో (66 శాతం) ప్రజలు అందించిన ఆశీర్వాదం.. ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండిరడినీ సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్‌ చెల్లింపు, ఉచిత కరెంట్‌, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, రూ. 500 లకే సిలిండర్‌, 27 వేల కోట్ల రూపాయల మేరకు సున్నా వడ్డీకే మహిళా సమాఖ్యలకు రుణాలు, 4.5 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 61 వేల ఉద్యోగాల భర్తీ, సుదీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం, వందేళ్లుగా జరగని బీసీ కులగణన చేపట్టడం, పేదలకు మంచి విద్యను అందించాలన్న ప్రయత్నాలు… ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి వివరించారు. ఒకవైపు ఆదాయాన్ని పెంచుకుంటూ దుబారాను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరక్కుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో శాసనసభలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
గాంధీజీ పేరు తొలగించడం దారుణం: సీఎం రేవంత్‌
ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దారుణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలోని భాజపా.. రాహుల్‌గాంధీపై కోపంతో రాజకీయం చేస్తోందన్నారు. గాంధీ అనే పేరు ఎక్కడా కనిపించకూడదని కేంద్రంలోని భాజపా దురాలోచన చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.