పల్లె ప్రగతి దిగ్విజయం అయ్యేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది కృషి ఎంతో ఉందని అన్నారం సర్పంచ్ శ్రీ తిరుమలవాసు కొనియాడారు!

గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలో పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించిన అన్నారం సర్పంచ్. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లె ప్రగతి దిగ్విజయంగా సాగిందని గ్రామాలు పల్లె ప్రకృతి, వైకుంఠధామం, నర్సరీ,డంపింగ్ యార్డ్ వంటివి రూపకల్పన చేసి ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు గతంలో పల్లెల్లో చెప్పుకునేందుకు ఏమీ ఉండేది కాదని ప్రస్తుతం అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతూ హరిత హారంలో పచ్చగా మారుతున్నాయి అని తెలిపారు మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మరింత అభివృద్ధి చెందుతుందని తిరుమలవాస్ కొనియాడారు! అనంతరం గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, మహిళా ఎంపీటీసీ సభ్యులు, ఉపసర్పంచ్ మురళి, గ్రామ పంచాయతీ సభ్యులు దర్గా శీను, మంగలి సత్యనారాయణ, డ్వాక్రా మహిళలు, అన్నారం వి.ఆర్ఓ. ప్రదీప్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.