పల్స్‌ పోలియో ప్రారంభించిన మంత్రి మాండవీయ

ఐదేళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపు
న్యూఢల్లీి,ఫిబ్రవరి26(జనం సాక్షి): పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ప్రతి 5ఏళ్లలోపు పసి పిల్లలకు పోలియో టీకా ఇప్పించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. మాన్సుక్‌ మాండవీయ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోలియో ఇమ్యూనైజేషన్‌ డ్రైవ్‌`2022 ను శనివారం ఆయన ప్రారంభించారు. ఐదు సంవత్సరాలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పని సరిగా వేయించాలని మంత్రి సూచించారు. పిల్లలకు పోలియో టీకాలను ఇప్పించడం ద్వారా వారి ఆరోగ్యం బాగుంటుందని, పిల్లల ఆరోగ్యం బాగుంటేనే స్వస్ధ కమ్యూనిటీ, స్వస్దనేషన్‌ సాధ్యమవుతుందని అన్నారు.యూనివర్శల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రామ్‌ కొంద దేశంలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు.