పళ్ల మార్కెట్‌ను ప్రారంభించిన కలెక్టర్
ఒంగోలు,సెప్టెంబర్28(జనంసాక్షి ): ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసిన పండ్లు, కూరగాయల సూపర్ బజారును కలెక్టర్ వినయచందు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూపర్ బజార్‌ను అద్దంకి ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు ద్వారా రైతుకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతుల కోసమే దీనిని ఏర్పాటు చేశామని అన్నారు.