పవన్‌ అభిమాని ఆత్మహత్య

– అంత్యక్రియల్లో పవన్‌ పాల్గొనాలని సూసైడ్‌నోట్‌లో రాసిన అనిల్‌
– కొంతకాలంగా జనసేనకు ఏవిూచేయలేక పోతున్నానే మనస్థాపంతో ఉన్న అనిల్‌
– ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య
– బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు
విజయవాడ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : హీరోపై పెంచుకున్న విపరీతమైన అభిమానం ఆ యువకుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ పెన్‌జోన్‌పేటలో నివాసం ఉంటున్న అనిల్‌ కుమార్‌కు పవన్‌ అంటే విపరీతమైన అభిమానం. జనసేన చేపట్టిన అనేక కార్యక్రమాల్లో అనిల్‌ పాలుపంచుకునేవాడు. కానీ ఇటీవల కాలంలో జనసేనకు తాను ఏవిూ చేయలేకపోతున్నానని బాధపడేవాడు. అదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పేవాడు. జనసేన కోసం ఏదో ఒకటి చేస్తానని చెబుతుండేవాడు. కాగా సోమవారం ఇంట్లో ఉన్నవారందరూ బయటకు వెళ్లిన సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్‌ కల్యాణ్‌ తన అంత్యక్రియల్లో పాల్గొనాలని అనిల్‌ తన చివరి కోరికగా సూసైడ్‌ నోట్‌లో రాశాడు. తన అభిమాన హీరో, అన్నయ్య కుటుంబసభ్యుడు పవన్‌ కల్యాణ్‌ అంటూ.. లేఖలో ప్రస్తావిస్తూ.. తన ఆత్మకు శాంతి చేకూరాలంటే తనను చూసేందుకు పవన్‌ రావాలని, ఆయన చేతుల విూదుగానే అంత్యక్రియలు నిర్వహించాలని లేఖలో కోరాడు. పేద కుటుంబానికి చెందిన అనిల్‌ కుమార్‌ జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. బలమైన కండలతో ఉండే అనిల్‌… బలహీనమైన మనస్తత్వంతో తనకు సంబంధంలేని అంశాల చుట్టూ ఓ బలమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని, తాను ఏవిూ చేయలేకపోతున్నాననే బాధతో చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. అనిల్‌ మరణం పవన్‌ అభిమానులను ఆవేదనకు గురిచేసింది.

తాజావార్తలు