పవన్‌… ధైర్యం ఉంటే చింతమనేనిపై పోటీ చేసి గెలువు

– టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌
అమరావతి, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కు ధైర్యం ఉంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై పోటీ చేసి గెలవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ సవాల్‌ విసిరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. పవన్‌ కళ్యాణ్‌ తన స్థాయి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని అమరావతిలో విమర్శించారు. ప్రజలు గెట్లు వేసి దెందులూరులో చింతమనేని గెలిపించారని తెలిపారు. ఆయన్ను విమర్శిస్తే దెందులూరు ప్రజలను అవమానించినట్లేని పేర్కొన్నారు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి పార్టీ కార్యకర్తలు సైతం తలలు పట్టకొనే పరిస్థితి పవన్‌ కల్పించుకున్నారని విమర్శించారు. పవన్‌, బీజేపీ మద్దతు లేకుడానే 2014  మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలలో మంచి  ఫలితాలు టీడీపీ సాధించించిందని రాజేంద్ర ప్రసాద్‌ గుర్తు చేశారు. పవన్‌, బీజేపి మద్దతు తీసుకోకుండానే 2019ఎన్నికలలో ఘన విజయం సాదిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్నేహ ధర్మానికి ప్రాధాన్యతనిచ్చి పవన్‌ కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ వాపును చుచి బలం అనుకుంటున్నాడని ఎద్దేవ చేశారు. ఇది మంచిది కాదని రాజేంద్ర ప్రసాద్‌ హితవు పలికారు.

తాజావార్తలు